27, నవంబర్ 2019, బుధవారం

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అనిపిస్తుంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది లేదో కానీ ఒకవ్యక్తి మాత్రం పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు.ఇతడిని చూస్తే ఆనందం కంటే అసూయ ఎక్కువగా ఉంటుంది .అతను ఎవరో కాదు మన అందరి రామ్ గోపాల్ వర్మ ముద్దుగా ఆర్జివి.


ఇది మీకు తెలుసా !రామ్ గోపాల్ వర్మ గారు చిన్నతనంలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. తాను కాలేజీ లో ఉన్నప్పుడు బ్రూస్లీ గారిని ఆరాధించేవాడు.వర్మ గారు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు శివ సినిమా తీయడానికి ముఖ్య కారణం తను కాలేజీలో ఉండగా జరిగిన సంఘటనలే ఆధారం.కొందరు సినిమాలు తీయడం ద్వారా వివాదాల్లో పడతారు కానీ వర్మ వివాదాలు చేయడానికి సినిమాలు తీస్తాడు.

ఈ మధ్యలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ద్వారా వివాదాలలో చిక్కుకున్న వర్మ ప్రస్తుతం ఎంటర్ ద  గర్ల్  డ్రాగన్ ద్వారా మన ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రాన్ని బిగ్  పీపుల్ ,టైగర్ కంపెనీ బ్యానర్ పై జింగిల్ లి  నిర్మించగా పూజ భాలేకర్ ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతోంది. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.

26, నవంబర్ 2019, మంగళవారం

అమ్మ తిరిగి మన ముందుకు రాబోతోంది...

నమస్కారం మిత్రమా!చరిత్ర మొదలయ్యే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ,అలాగే చరిత్ర సృష్టించాలంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.పది మందిలో ఒక్కడిలా బతకడం చాలా సులభం కానీ కోటిమందికి ఒకడిలా బతకాలంటే ఎంతో ఓర్పు, సహనం ,నడవడిక అవసరం.

చరిత్ర సృష్టించిన ప్రతి సృష్టి కారుడి జీవితంలో అనేక బాధలు కష్టాలు. వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు సాగారు కాబట్టి వారు చరిత్రను సృష్టించారు.ఇదంతా మీరు ఎందుకు అని అనుకుంటున్నారా 50 సంవత్సరాల క్రితం ఒక సాదాసీదా నటిగా మొదలైన తన ప్రయాణం కేవలం తమిళనాడు ప్రభుత్వమే కాదు మొత్తం దేశాన్ని ఊపేస్తుందని ఎవరూ ఊహించలేదు ఆమె ఎవరో కాదు తమిళ తంబీలు ముద్దుగా అమ్మ అని పిలుచుకునే జయలలిత గారు.

జయలలిత గారు సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి,  రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి జయహో అమ్మ అని  ప్రజల చేత నీరాజనాలు అందుకుంది.కానీ చివరగా ఆమె మరణం వెనుక ఎవరికీ తెలియని రహస్యం దాగి ఉంది. అందుకే ఆమె  జీవితాన్ని తలైవి అనే పేరుతో సినిమా ను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని విబ్రి మరియు కర్మ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విష్ణువర్ధన్ ఇందూరి మరియు శైలేష్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ గారు కథను అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎ.ఎల్ .విజయ్ దర్శకత్వం వహించగా జూన్ 26 2020 సంవత్సరం లో విడుదల కానుంది.ఈ చిత్రం మూడు భాషల్లో అనగా తెలుగు, తమిళం ,హిందీలోతెరకెక్కుతుంది.ఈ చిత్రంలో భారతదేశం గర్వించదగ్గ నటి కంగనా రనౌత్ నటించగా అరవిందస్వామి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.కంగనా రనౌత్ గారిపై ప్రోస్థటిక్ మేకప్ తో    జయలలిత గారి మొదటి పోస్టర్ ను రిలీజ్  చేశారు.

శుభవార్త! టోనీ స్టార్క్ ఇండియాకి రాబోతున్నాడు

నమస్కారం మిత్రమా !కొందరు వేసుకొనే బట్టలను బట్టి రాయల్ గా కనిపిస్తారు,  కొందరు వారి మాట తీరు నడవడిక బట్టి రాయల్ కనిపిస్తారు, కొందరు వారి హావభావాలను బట్టి రాయల్ కనిపిస్తారు.కానీ మనం చెప్పుకున్న అన్నింటిలో రాయల్ గా కనిపించే ఒకే ఒక్క వ్యక్తి మన బాలయ్య .బాలకృష్ణ గారు డ్యాన్స్ లైన ,ఫైట్లు అయినా ,డైలాగులు అయినా ఏది చేసినరాయల్ గా ఉంటుంది.

ఇది మీకు తెలుసా !భాష అర్థం కాకున్నా కేవలం బాలయ్య బాబు మాస్ ఫైట్లు మరియు డాన్స్ లు ,డైలాగులు కోసం బాలకృష్ణ గారి సినిమాలు చూసే నార్త్ ఇండియన్ వారు చాలా మంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అది వేరే చెప్పనక్కర్లేదు.సినిమా అయినా ,రాజకీయమైన ఆయనే రూలర్. రోజురోజుకీ బాలకృష్ణ గారి వయసు తగ్గిపోతోంది చిత్రంలో ఆయన నాజుగ్గా ఇండియన్ టోని స్టార్క్ లాగా కనిపించబోతున్నారు.

బాలకృష్ణ గారు ఎంచుకునే కథలలో కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే  కాకుండా ఫ్యామిలీ డ్రామా కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు.ఈ చిత్రంలో బాలకృష్ణ గారు ధర్మ అనేది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ,మరియు టోనీ స్టార్క్ లాంటి గెటప్ తో కుర్రాడిలా కనిపించబోతున్నారు.ఈ చిత్రంలో లోప్రకాష్ రాజు గారు ,భూమిక, వేదిక ,సోనాల్ చౌహన్ నటించారు.

ఈ చిత్రాన్ని దర్శక దిగ్గజం అయిన కె.ఎస్.రవికుమార్ గారు దర్శకత్వం వహించారు. ఇంతకు మునుపే ఆయన బాలకృష్ణ గారితో జైసింహ తీసి ఘన విజయం సాధించారు.ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ గారు నిర్మించారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు.ఈచిత్రం క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

25, నవంబర్ 2019, సోమవారం

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ మొగుడు వచ్చేస్తున్నాడు.

నమస్కారం మిత్రమా!మామూలుగా మనం ఏ పని చేసినా అందులో మంచీ, చెడూ ఉంటుంది. ఒకవేళ చెడు చేస్తే దండిస్తారు అదే మంచి పని చేస్తే ప్రశంసిస్తారు.ఆ ప్రశంసించే విధానంలో కూడా మార్పులు ఉంటాయి అనగా మనం చేసే పని చాలా గొప్పది అయితే గొప్ప ప్రశంసలు దొరుకుతాయి.అది ఏ పరిశ్రమ కానివ్వండి రాజకీయమైన క్రీడారంగం అయిన సినీ పరిశ్రమ అయిన.


సినీ పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ ఉన్నారు అయినా కూడా తన కంటూ తాను మంచి కథలు ఎంచుకుంటూ ఒక్కో  మెట్టు ఎక్కుతూ అందరికీ ఆరోగ్యవంతమైన పోటీని ఇస్తూ తనకు తానే సాటిగా కేవలం సినీ రంగంలోనే కాకుండా పరిశ్రమ రంగంలో కూడా తనకు తానే ధీటుగా దూకుడు ప్రదర్శించే అమ్మాయిల కలల రాజకుమారుడు మన పోకిరి సూపర్ స్టార్ మహేష్ బాబు .

తన నటన ,ఎంచుకునే కథలే ఆయనకు సరిలేరు నీకెవ్వరు ru అని అనిపించుకునేలా ఉంటాయి.ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు  ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్నారు . మహేష్ బాబు నట జీవితం మర్చిపోలేని చిత్రం ఒక్కడు లో కర్నూలు బురుజు అందరికీ సుపరిచితమైన సన్నివేశం తిరిగి ఈ చిత్రంలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా అందాల తార రష్మిక మందన్న జంటగా నటించగా లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి గారు రీఎంట్రీ  ఈఈ చిత్రంతో ఇవ్వడం విశేషం.ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు నటించారు.ఈ చిత్రాన్ని మహేష్ బాబు మరియు దిల్ రాజు,రాంబ్రహ్మం సుంకర కలిసి తమ బ్యానర్ లో నిర్మించారు .దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానుంది.

గుడ్ న్యూస్ ..... అక్షయ్ కుమార్ తండ్రి కాబోతున్నాడు.

నమస్కారం మిత్రమా! నీకు గుడ్ న్యూస్ !బ్యాడ్ న్యూస్ కూడా ఉంది , గుడ్ న్యూస్ చెప్పమంటారా బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా .మీకు గుడ్ న్యూస్  వినాలని ఆత్రుతగా ఉందా అయితే వినండి‌.మామూలుగా మనకు గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తుంది అంటే ఎగ్జామ్లో టాప్ చేసినప్పుడో,  బిజినెస్ లో లాభాలు వచ్చినప్పుడు ,మధ్యతరగతి కుటుంబాల్లో పనిచేసే కార్మికుల జీతాలు పెరిగినప్పుడు వినిపిస్తూ ఉంటుంది.

కానీ మనం ఇప్పుడు  చెప్పుకునే గుడ్ న్యూస్ అందరి ఇళ్లలో సామాన్యంగా వినిపించే గుడ్ న్యూస్ అదేమిటంటే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హీరో అక్షయ్ కుమార్ తండ్రి కాబోతున్నాడు.కానీ ఇక్కడే ఒక చిన్న  ట్విస్ట్ అదేమిటంటే నిజజీవితంలో కాదు గుడ్ న్యూస్ అనే సినిమాలో అక్షయ్ కుమార్ తండ్రి కాబోతున్నాడు.

అదేనండీ అక్షయ్ కుమార్, కరీనా కపూర్ చాలా ఏళ్ల తర్వాత జంటగా దిల్జిత్ మరియు కియారా అద్వానీ జంటగా నటించిన గుడ్ న్యూస్ అని చిత్రం త్వరలో మన ముందుకు రానుంది. అది సరే మరి బ్యాడ్ న్యూస్ ఏమిటి అని అనుకుంటున్నారా ఈ చిత్ర కథ నేటి సమాజంలో జరుగుతున్న ఇబ్బందులను చిత్ర దర్శకుడు హాస్య రూపంలో చిత్రీకరించారు.నేటి సమాజంలో యువత తమ బిజీ లైఫ్ లో ఏకాంతం మర్చిపోతున్నారు.

దాని కారణంగా సరైన సమయంలో పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .ఈ విషయంపై ఈ చిత్రంలో స్త్రీ నుంచి అండాలను, పురుషుని నుంచి సెమెన్   సేకరించి ల్యాబ్ లో పిల్లలను కనే ప్రక్రియ .అయితే ఈ ప్రక్రియలో భాగంగా అక్షయ్ కుమార్ మరియు దిల్జిత్ సెమెన్  అటుఇటుగా గజిబిజిగా మారిపోవడంతో చిత్రకథ లో మలుపులు తిరిగాయి.ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ పై కరణ్ జోహార్ నిర్మించగా రాజ్ మెహతా దర్శకత్వం వహించారు.ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

10, నవంబర్ 2019, ఆదివారం

దయ్యాలంటే భయమా.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే

నమస్కారం మిత్రమా, నేను ఈ మధ్య కాలంలో ఒక దగ్గర చదివాను అదేమిటంటే మనిషి మెదడు ప్రవర్తించే తీరు అనగా ఎదురుగా ఎవరైనా సంతోషిస్తే మనం సంతోషిస్తాం ,ఎవరైనాభాధలో ఉంటే మన మనసు కూడా బాధిస్తుంది ఇదే విషయం వెండి తెరపై చూసినప్పుడు మనకు కలుగుతుంది ఆ చిత్రంలో ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాటి తాలూకు ప్రభావం మన మెదడుపై కలుగుతుందట.


అదేంటోగాని మనకు దయ్యాల సినిమా చూసినప్పుడు ఒకవైపు భయం కలుగుతుంది కానీ మరోవైపు చూడాలని ఆత్రుత ఎక్కువగా ఉంటుంది.మన భారతీయ భాషల్లో ఎక్కువగా దయ్యాల సినిమాలు చూస్తూ ఉంటాం కానీ హారర్ థ్రిల్లర్ సినిమాలు తక్కువ వస్తుంటాయి . హారర్ థ్రిల్లర్ ఎక్కువగా హాలీవుడ్  లో ఉన్నాయి.

ఈవిల్ డెడ్ ఈ పేరు వినని వారు ఉండరు అనేది నా నమ్మకం ఎందుకంటే అప్పటి వరకు దయ్యాల సినిమాలు ఒకేలా ఉంటే ఈవిల్ డెడ్ చిత్రం ఒక మార్గం చూపించింది.ఆ చిత్రాలు వచ్చి చాలా ఏళ్ళు అయినా ఇప్పటికీ చూసినా కూడా అందులో పాత్రలు మనల్ని బయటపెడుతూ ఉంటాయి.ఈ మధ్యకాలంలో నాకు పర్సనల్గా ఇష్టమైన చిత్రం డోంట్ బ్రీత్. ఈ చిత్రంలో ఓ మాజీ సైనికుడి ఇంట్లో దొంగలు చొర పడిన తర్వాత వారిని ఎలా చంపాడు అనేది చిత్ర కథ. మిత్రమా మీరు తప్పక చూడాల్సిన చిత్రం డోంట్ బ్రీత్ .

ప్రస్తుతం ఈవిల్ డెడ్ మరియు డోంట్ బ్రీత్  ప్రొడక్షన్ హౌస్ లో వస్తున్న కొత్త హారర్ థ్రిల్లర్ చిత్రం గ్రడ్జ్.   విశేషమేమిటంటే ఈ చిత్రం పేరుతో చాలా చిత్రాలు ఇదివరకే వచ్చి ఉన్నాయి కానీ  ఈ సారి ఈవిల్ డెడ్ మరియు డోంట్ బ్రీత్ చిత్రాలను తెరకెక్కించిన ప్రొడక్షన్ హౌస్లో రావటమనేది విశేషం.ఈ చిత్రం జనవరి 3 న విడుదలకు సిద్ధంగా ఉంది.మిత్రమా ఈ కంటెంట్ గనుక నీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్, షేర్ ,కామెంట్ చేయగలరు.

9, నవంబర్ 2019, శనివారం

ఒక పెళ్ళాం వద్దు ఇద్దరు ముద్దు అంటున్న యువ కథానాయకుడు

నమస్కారం మిత్రమా నాకో సందేహం కలిగింది మీరు తీర్చగలరా..మనిషి పుట్టిన తర్వాత చిన్నవయసులోనే స్కూల్ కి వెళ్ళాము  స్కూల్ టైం లో చాలామంది ఉన్నారు కాలేజీలో నీకు విశ్రాంతి దొరుకుతుంది అని అలాగే మనం కాలేజీ కి వెళ్ళాం కాలేజీకి వెళ్లే టైం లో కొందరన్నారు జాబ్ చేస్తే విశ్రాంతి దొరుకుతుందని.

జాబ్ చేసే టైంలో కొందరున్నారు పెళ్లి చేసుకుంటే విశ్రాంతి e దొరుకుతుందని చాలా మంది మనలో ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు ఆఖరికి పెళ్లి చేసుకుంటే విశ్రాంతి e దొరుకుతుందో లేదో కానీ కష్టాలు మాత్రం పెరిగిపోతాయి అనేది నగ్నసత్యం.ఇదే విషయాన్ని ఒక కుర్రాడు సీరియస్ గా తీసుకుని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కొంతకాలం అతడికి బానే గడిచింది ఆ తర్వాత మొదలయ్యాయి కష్టాలు.


అప్పుడు అతడికి వరంలా అమ్మాయి కలిసింది .ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయిని వాళ్ళ భార్యకు తెలియకుండా ఎలా మోసం చేశాడా.. లేదా ఎలా మోసపోయాడా తెలుసుకోవాలంటే చూడాల్సిందే త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం పతి పత్ని ఔర్ వో...  మీరు అనుకోవచ్చు ఇలాంటి కథలు మన తెలుగు చిత్రాల్లో ఎన్నో చూసాము ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఏమండీ ఆవిడ వచ్చింది,ఆయనకిద్దరు ,ఆవిడా మా ఆవిడే,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.

కానీ ఇప్పుడు వస్తున్న ఈ చిత్రం ప్రస్తుత  జనరేషన్ కి తగ్గట్టు  పాత చిత్రాన్ని కొత్తగా మన ముందుకు తీసుకొస్తున్నారు.ఈ చిత్రంలో కార్తిక్ ఆర్యన్, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రాన్ని టి సిరీస్ పై భూషణ్ కుమార్ నిర్మించగా ముదస్సిర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కాబోతుంది.ఇలాంటి ఫ్యామిలీ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని కోరుకుంటూ చిత్రం విజయం సాధించాలని ఆశిద్దాం.

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...