29, అక్టోబర్ 2019, మంగళవారం

ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అని అంటున్న యువహీరో

       జీవితంలో కోరుకున్నవి జరగాలి అని అందరూ అనుకుంటారు కానీ జరిగేది జరగక మానదు, జరగాల్సింది మనకు చెప్పి జరగదు.పుట్టిన పసి పిల్లాడి నుంచి కాటికి వెళ్లే ముసలివాడి దాకా అందరికీ స్వతహాగా కోరికలు ఉంటాయి.పుట్టిన పిల్లవాడు తనకు కావాల్సింది ఏడ్చి దక్కించుకుంటాడు అలాగే ముసలి వయసులో ఉన్నవారు తమ కోరికలు చాదస్తం తో తీర్చుకుంటారు.


              కానీ యుక్తవయసులో ఉన్న ప్రతి ఒక్క యువతీ, యువకులు తాము కోరుకున్నవి ఎలా సాధించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఒకవైపు చేసే పని మనసుకు నచ్చక మరోవైపు మనసుకు నచ్చే పని చేయలేక ఇటు మనసుకు అటు సమాజానికి మధ్యలో యువత ప్రెషర్ కుక్కర్ లో పప్పు లాగా నలిగి పోతున్నారు.ఈ కథాంశం తో ఇటీవల తెరకెక్కిస్తున్న ప్రెషర్ కుక్కర్ చిత్ర టీజర్ విడుదల అయింది.

               
                              ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన చిత్రాలు రాలేదని అందరూ గుసగుసలాడుతున్నారు .కానీ కథలో దమ్ముంటే చిన్న చిత్రం పెద్ద చిత్రం అని తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు.ఈ చిత్రం టీజర్ లో కథానాయకుడికి చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలని బ్రెయిన్ వాష్ చేసి ఉంచాడు .తీరా అమెరికా వెళ్లే సమయంలో కథ ఎలా మలుపు తిరిగింది అనేది చూడాల్సి ఉంది.   
       

                                       ఈ చిత్రంలో సాయి రోనక్ , ప్రీతి అస్రాని,   రాహుల్ రామకృష్ణ ,తనికెళ్ల భరణి గారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి ప్రొడక్షన్స్ లో సుజుయ్ దర్శకత్వం వహించారు.పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు.సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. నవంబర్ 8న ఈచిత్రం విడుదల కాబోతోంది.
   
                            

28, అక్టోబర్ 2019, సోమవారం

ఆ దర్శకుడికి ఫోన్ లో బెదిరిస్తున్న గుర్తు తెలియని ఆగంతకుడు

కొందరు వైవిధ్యం చేస్తే అది వివాదమై పోతుంది అదే కొందరు వివాదం చేస్తే అది వైవిధ్యం అయిపోతుంది ఇంకా చెప్పాలంటే కొందరు వైవిధ్యం చేసిన వివాదం చేసినా అది వివాదమే అయిపోతుంది అర్థం కాలేదు కదా ఎవరికీ అర్థం కాని వ్యక్తే రామ్ గోపాల్ వర్మ  .మనం చాలా జీవులను చూశాం మృతజీవులు చూసాము, ప్రేత జీవులు చూసాం కానీ ఈ జీవి వివాద జీవి ఆయనే మన ఆర్ జి వి .

శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా ఇలా కూడా తీయవచ్చు అని నిరూపించిన వ్యక్తి రాంగోపాల్ వర్మ ఆ తర్వాత ఎన్నో రకాల దెయ్యాల సినిమాలు తీశారు.హిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ లోకి వెళ్లి తన సత్తా చాటారు.తిరిగి ఈ మధ్యలో బాలీవుడ్ బోర్ కొట్టేసి తిరిగి తన స్వస్థలం అయిన టాలీవుడ్ కు వచ్చారు.


వర్మ వచ్చీరాగానే రక్త చరిత్ర ,బెజవాడ రౌడీలు, వీరప్పన్ ,లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి లాంటి వివాదాస్పదమైన బయోపిక్ చిత్రాలను తెరకెక్కించారు . సినిమాలను తెరకెక్కించడంలో వర్మది వైవిధ్యమైన స్టైల్ ఆ స్టైల్ అందరికీ ఇష్టం కానీ చివరికి అది వివాదం అయిపోతుంది. ఆయన కావాలని వివాదం చేస్తాడా లేక ఆయన చేసింది వివాదమై పోతుందో అర్థం కాదు.

ఆయన తీసే సినిమాల్లో ముఖ్యంగా ఆయన చూపించే పాత్రల హావభావాలు ,ముఖచిత్రాలు, హింస అందర్నీ ఆకట్టుకుంటాయి.ఎక్కడనుంచి తీసుకొస్తాడో   తెలియదు కానీ ఆ నటులు సరిగ్గా ఆ పాత్ర కోసమే పుట్టారా అన్నట్టు వాళ్లను తీర్చిదిద్దుతాడు వర్మ.ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.ఈ చిత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వస్తున్న మార్పులను ఉద్దేశించి చిత్రీకరించడం జరిగింది.


ఈమధ్య వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చాలా పెద్ద వివాదం జరిగింది .ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ చిత్రంలో కూడా చంద్రబాబు నాయుడు ,జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కె. ఏ .పాల్ స్థాపించిన రాజకీయ పార్టీల నుద్దేశించి ప్రస్తుత రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో తన స్టైల్లో చూపించబోతున్నాడు.ఈ చిత్రం టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ మైసూర్ నిర్మించారు.త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

27, అక్టోబర్ 2019, ఆదివారం

కన్నార్పకుండా చూసే భారీ యాక్షన్ చిత్రం

ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు కానీ అతడికి బాగా తెలుసు ఎలాంటి కథలు ఎంచుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారో అతడే విశాల్ కాదు కాదు విశాల్ రెడ్డి .పేరుకే తమిళనటుడు కానీ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మన తెలుగువాడు అని చెప్పి ఆదరిస్తూ ఉంటారు.విశాల్ ఎంచుకునే కథలు రోజురోజుకు అతని స్టార్ డమ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాయి.



విశాల్ ఎంచుకునే కథలో వైవిధ్యం యాక్షన్ కామెడీ డ్రామా అన్ని కలబోసి ఉంటాయి.కానీ విశాల్ ఎక్కువ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు అతని సినిమా కెరీర్లో చూసుకుంటే పొగరు ,పందెంకోడి ,భయ్యా, భరణి ,కథకళి ,మగమహారాజు, అభిమన్యుడు, వేటాడు వెంటాడు, వాడు వీడు ,ఇంద్రుడు ,పూజ ,జయ సూర్య, డిటెక్టివ్, రాయుడు ఇలా అతను చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం కోసం పరితపిస్తూ ఉంటాడు.


విశాల్ ముందుగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ముఖాన్ని అద్దంలో చూసుకోండి అన్నారంట కానీ ఇప్పుడు ఆ అద్దాన్ని డబ్బులు చూసి నిర్మాతలు సంపాదిస్తున్నారు .విశాల్ ఎక్కువగా తన బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి యాక్షన్ సినిమాలకు సరిపోతాడు ,అందుకే ప్రస్తుత  సినిమాలో కంప్లీట్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు సినిమా పేరు యాక్షన్.

పేరుకు తగ్గట్టే యాక్షన్ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి .విశాల్ కు జోడిగా తమన్నా నటించింది .ఈ చిత్రాన్ని సుందర్.సి గారు దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ట్రిడెంట్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఆర్. రవీంద్ర గారు నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రంలో విశాల్ కల్నల్ సుభాష్ గా కనిపించబోతున్నారు.ఈ చిత్రంలో విశాల్  రా ఏజెంట్ గా లండన్ కి వెళ్లి అక్కడి నుండి మన దేశాన్ని దేశద్రోహులు నుండి ఎలా కాపాడారు అనేది కథాంశం. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించారు. నవంబర్లో చిత్రం రిలీజ్ .

26, అక్టోబర్ 2019, శనివారం

వివాదాల నుండి బయటపడ్డ యువహీరో

మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కధలో దమ్ముంటే  ఏ భాషతో సంబంధం లేకుండా చూస్తారు. అలాంటి మంచి కథతో మన ముందుకు రాబోతోంది శాటిలైట్ శంకర్ అనే సినిమా. ఇందులో సూరజ్ పంచోలీ మేఘా ఆకాష్ జంటగా రాబోతున్న చిత్రం నవంబర్ 8న మన అభిమాన థియేటర్ లో విడుదల కాబోతోంది.


సూరజ్ పంచోలి ఈ  మధ్య కాలంలో వినిపిస్తున్న పేరు ఎందుకంటే గత ఆరు  సంవత్సరాలుగా తనపై ఒక కేసు నమోదయింది. తన ప్రియురాలు జియాఖాన్ మర్డర్ కేసు లో ఇతను ఇరుక్కుపోయి ఆరు సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే నిర్దోషిగా బయటకు వచ్చాడు.2013లో జియాఖాన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది .2015లో సూరజ్ పంచోలి అతియా శెట్టి కలిసి హీరో అనే రొమాంటిక్ చిత్రం ద్వారా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి పరిచయం చేశారు.


తిరిగి 2019 అనగా ఇప్పుడు శాటిలైట్ శంకర్ అనే చిత్రంతో సూరజ్ పంచోలి చాలా కాలం తర్వాత మన ముందుకు వస్తున్నారు.ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది . ఒక ఆర్మీ సోల్జర్ తన ఇంటికి బయలుదేరి మార్గమధ్యంలో తన ప్రాణాలకు తెగించి  కొందరిని కాపాడే సమయంలో కొందరు పోకిరీల వల్ల మధ్యలో చిక్కుకుపోయి ఇంటికి చేరుకోని పరిస్థితి లో ఉంటాడు చివరికి తన ఇంటిని ఎలా చేరుకున్నాడు ,తన తల్లిని ఎలా కలుసుకున్నాడు అనేదే కథ.


ఈ చిత్రంతో తనను తాను తిరిగి నిరూపించుకోవాలని ధీమాతో ఉన్నాడు సూరజ్ పంచోలి .ఈ చిత్రం సినీ వన్ ఎంటర్టైన్మెంట్ పై మురాద్  ఖేతాని నిర్మించగా ఇర్ఫాన్ కమల్ దర్శకత్వం వహించారు. మిథున్ సంగీతాన్ని అందించారు.దేశ భక్తికి సంబంధించిన చిత్రం కాబట్టి ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.జై హింద్.


25, అక్టోబర్ 2019, శుక్రవారం

నవ్వులను పంచడానికి వచ్చేశారు పాగల్ పంతి టీమ్

మామూలుగా మనకు సినిమాలు అనగానే  కొందరికి ప్రేమ కథలంటే ఇష్టం.మరి కొందరికి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. హారర్ సినిమాలు మనం భయపడుతూనే ఇష్టంగ చూస్తాం.కానీ కామెడీ జానర్ చిత్రాలు ప్రతి ఒక్క  ప్రేక్షకుడిని అలరింపజేస్తాయి. భాషతో సంబంధం లేకుండా కామెడీని అందరూ ఆస్వాదిస్తారు.

2007 వ సంవత్సరంలో అక్షయ్ కుమార్ హీరోగా  కత్రినా కైఫ్ జంటగా నానా పాటే కర్, అనిల్ కపూర్ కలిసి నటించిన వెల్‌కమ్ చిత్రం గొప్ప విజయం సాధించింది.2015 లో జాన్ అబ్రహాం, శృతి హాసన్, అనిల్ కపూర్, నానా పాటేకర్ నటించిన వెల్‌కమ్ బ్యాక్ చిత్రం విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలను అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం వెల్కమ్ చిత్ర బృందం తిరిగి ఈ చిత్ర సీక్వెల్  మన ముందుకు తీసుకువస్తున్నారు .కానీ చిత్ర టైటిల్ పాగల్ పంతి అని మార్చారు. ముగ్గురు కొంటె కుర్రాళ్ళు తాము ధనవంతులమని అబద్ధం చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళను ఎలా ఆట పట్టించారో  అనేది చిత్ర కథ.చాలా మలుపులతో చాలా మంది నటీ నటులతో గమ్మత్తుగా ఉండబోతోంది ఈ సినిమా.

ఈ చిత్రంలో జాన్ అబ్రహం, ఇలియానా, అనిల్ కపూర్, అర్షద్ వార్సి, పులకిత్  సామ్రాట్, ఊర్వశి, క్రితి  కర్బందా ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రం T-సిరీస్ భూషన్ కుమార్ నిర్మించగా అనీష్ బాజ్మీ  దర్శకత్వం వహించారు.సాజిద్ - వాజిద్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది.కామెడిని ఆస్వాదించాలంటే ఈ చిత్రం తప్పక చూడాల్సిందే.

24, అక్టోబర్ 2019, గురువారం

సెగలు పుట్టిస్తున్న విద్యుత్ కమాండో 3

విద్యుత్ జామ్వాల్  ఈ పేరు వినగానే ఎవరో అని అనుకోకండి, చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్  పై ఇష్టమే    అతడిని ఎంత కష్టమైన ఇష్టంగా నేర్చుకునేలా చేసింది.ఆ తర్వాత సినిమాల పై అతడికి ఉన్న ఇష్టం సినిమా ఇండస్ట్రీ వైపు అడుగుల నేర్పించింది. కానీ ఇండస్ట్రీ లో ఇతనికి ఎవరూ గాడ్ ఫాదర్  లేరు. చాలా ప్రయత్నం చేశాడు. చివరకి మన దక్షిణాది వారే అవకాశం కల్పించారు.

NTR నటించిన శక్తి సినిమాలో విలన్ గా, సూర్య సరసన స్నేహితుడి గా  నటించాడు.కాని ఒకటే కోరిక ఎప్పటికైనా బాలీవుడ్ లో హీరో అవ్వాలని. ఎందుకంటే మంచి నటుడు, అందగాడు, మార్షల్ ఆర్ట్స్  తెలిసిన వాడు. చివరకు తన నైపుణ్యాన్ని అందరికి తెలిపే అవకాశం కమాండో అనే సినిమా ద్వారా కలిగింది అప్పటి వరకు హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్ ఒకలా ఉంటే ఈ చిత్రంలో యాక్షన్ ని భిన్నంగా స్వతహాగా విద్యుత్ ఎలాంటి  డూప్  లేకుండా చేశాడు. ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దేశమంతటా పేరు మారుమోగిపోయింది.


ఆ తర్వాత నుండి విద్యుత్ జామ్వాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అతడు డూప్ లేకుండా చేసే పోరాట దృశ్యాలు అభిమానులకు తెగ నచ్చేశాయి.ఆ తర్వాత కమాండో - 2 2017 లో వచ్చింది. ఇందులో అదా శర్మ పోలీస్ ఆఫిసర్ గా భావనారెడ్డి పాత్రలో నటించింది.ఇటివల కమాండో - 3తో మన ముందుకు రాబోతున్నారు.


కమాండో లో ప్రేమ కథ , కమాండో - 2 లో నల్లధనం గురించి మలేషియా ప్రాంతంలో  కథ నడిచింది.కమాండో 3 లో ఓ ఉగ్రవాది ఇండియా ను భయపెడుతుంటే అతడిని పట్టుకునే పాత్రలో విద్యుత్ జామ్వాల్ కంప్లీట్ యాక్షన్ మరో పాత్ర భావానారెడ్డి గా అదాశర్మ అలరించనుంది.ఈ చిత్రం మోషన్ పిక్చర్స్ & రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పై విపుల్ అమృత్ లాల్ షా నిర్మించగా ఆదిత్య దర్శకత్వం వహించారు. నవంబర్ 29న రిలీజ్ .యాక్షన్ థ్రిల్లర్  జోనర్  ఇష్ట పడేవారు కచ్చితంగా  చాడాల్సిన చిత్రం .

చుల్ బుల్ దబాంగ్ ... దబాంగ్ .. దబాంగ్ ...

ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న  వారందరికి ఆనందాన్ని నింపడానికి మన ముందుకు వచ్చేశాడు రికార్డుల మోత మోగించే కండల వీరుడు చుల్ బుల్ పాండే.... అదేనండి దబాంగ్ స్టార్     సల్మాన్ ఖాన్.ఇటీవలే దబాంగ్ 3 చిత్ర ట్రైలర్   ఆ చిత్ర బృందం విడుదల చేసింది.

2010 సంవత్సరంలో విడుదలైన దబాంగ్ మొదటి భాగంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా తొలి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో సోనూసూద్ ప్రతినాయకుడిగా నటించి అలరించారు.అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ లో సాజిద్- వాజిద్ సంగీతాన్ని అందించారు.ఇన్నేళ్ళయినా మున్నీ బద్నాం పాటను ఎవరూ మర్చి పోరు అనేది అతిశయోక్తి కాదు. ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించింది అంటే ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ రూపంలో మైలురాయిని అందించింది.

2012 లో దబాంగ్ 2 అర్బాజ్  ఖాన్ ప్రొడక్షన్స్  మరియు దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా నటించారు.ఈ చిత్రం ఘన విజయం సాధించి దబాంగ్ ఫ్రాంచైజీ పేరు నిలబెట్టింది.చాలా కాలం తర్వాత దబాంగ్ 3 ప్రభుదేవా గారి దర్శకత్వం లో సల్మాన్  మరియు అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ లో డిసెంబర్ 20న మన ముందుకు రానుంది.ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్  కూతురు సయి మంజ్రేకర్  తొలి పరిచయం కానుంది.సాజిద్- వాజిద్ సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రంలో అంచెలు అంచెలుగా ఎదుగుతున్న  దక్షిణాది నటుడు కిచ్చ సుదీప్ గారు ప్రతినాయకుడి పాత్రలో అలరించబోతున్నా రు. చాలా రోజుల నుండి సరైన విజయం లేని సోనాక్షి సిన్హా ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. వాంటెడ్ ( తెలుగు లో పోకిరి) తర్వత ప్రభుదేవా - సల్మాన్  ఖాన్ కలిసి పని చేశారు.ఈ చిత్ర ట్రైలర్  అదిరిపోయింంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనువాదం కానుంది.

19, అక్టోబర్ 2019, శనివారం

22 కత్తిపోట్లు..... యువ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి గారు

మనకు కుల రాజకీయాలు తెలుసు, మత రాజకీయాలు తెలుసు. కానీ ఈ రాజకీయాలు ముఖ్యంగా కళాశాల వయసులో మన మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అదే మనం చెప్పుకునే విద్యార్థి సంఘాలు యూనివర్శిటీలో చదువుకునే విద్యార్థులు  ఎదుర్కొంటున్న  ఇబ్బందులు అనగా స్కాలర్ షిప్స్  సమస్యలు, భోదనా సమస్యలు , ర్యాగింగ్ సమస్యలు.


అది... 1967... ఉస్మానియా యూనివర్సిటీ... ఆ కాలంలో ఎక్కువగా కుల పిచ్చి ఉండేది. మా కులం పెద్దది అంటే మా కులం పెద్దది అని చదువుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాధి వ్యాపించిన  రోజులవి.చిన్న కులాలు, పెద్ద కులాలని విడిపోయి ఒకరిని  ఒకరు హేళన చేస్తూ  ర్యాగింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఒకడు వచ్చాడు. ఈ కుల భేదాలను రూపుమాపడానికి ప్రయత్నం చేశాడు.


ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ , ఎన్నో ఆటుపోట్లను, 22 కత్తిపోట్లను భరిస్తూ విద్యార్థి సంఘాలను నిర్మించి  25 సంవత్సరాల జీవితాన్ని విద్యార్థి సంఘాలకు అంకితం చేసిన ఘనుడు .... శ్రీ జార్జ్ రెడ్డిగారు. స్వతహాగ బాక్సర్  అయిన ఈయన ఎంతో మంది పోరాట యోధులను ఆదర్శంగా చేసుకొని ప్రస్తుతం మనకు ఆదర్శంగా నిలిచారు. చివరగా ప్రత్యర్ధుల చేతిలో చంపబడ్డాడు.

జార్జ్  రెడ్డి గారి జీవితం ఎంతో మందికి స్పూర్తి  దాయకం. అందుకే ఈయన జీవితాన్ని ఆధారంగా  చేసుకొని జార్జ్ రెడ్డి పేరు తో చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మణిరత్నం గారు తీసిన యువ అనే చిత్రంలో సూర్య పోషించిన పాత్ర జార్జ్ రెడ్డి గారి ఆదర్శమే. ఇందులో సందీప్ మాధవన్, సత్యదేవ్, మనోజ్ నందం ముఖ్య పాత్రల్లో నటించారు.సురేష్ బొబ్బిలి  సంగీతాన్ని అందించారు.అప్పి రెడ్డి నిర్మించగా జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదల కానుంది.

15, అక్టోబర్ 2019, మంగళవారం

ఉజ్ డా చమన్ చిత్ర ట్రైలర్ విడుదల

ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కోంటున్న సమస్య బట్టతల .తలపై వెంట్రుకలు ఉంటే ఎలాగైనా స్టైల్ చేసుకోవచ్చు. కాని అసలే వెంట్రుకలు లేకుంటే ఎలా...... ఈ సమస్యలకు పరిష్కారంగా తలపై వెంట్రుకలను మొలిపించె ఎన్నో రకాల తైలాలు, సాంకేతిక పద్ధతులలో వెంట్రుకలను మొలిపించగల సెంటర్లు వెలుస్తున్నాయి.

యవ్వనంలో ఓ కుర్రాడికి బట్టతల సమస్య రాగా అతను సమాజంలో ఎలా అవమానాలు ఎదురుకొన్నాడు, తన పెళ్లి విషయంలో  ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు  అనే విషయంపై ఉజ్ డా చమన్ అనే చిత్రం మన ముందుకు రాబోతోంది.సన్నీ సింగ్ కథానాయకుడు.ఓ 30 యేళ్ళ యువకుడు ఓ కాలేజ్ లో స్ట్రర్ గా పనిచేస్తుంటాడు. ఈ చిత్రం కన్నడ మాతృ క ఒండ్రు మొట్టయ కథ  నుండి తీసుకోబడింది.


అతడిని అందరూ బట్టతల అని  హేళ న చేస్తారు.ఓ పూజారి ఇతడికి మరో సంవత్సర కాలంలో వివాహం జరగకపోతే జీవితంలో వివాహ యోగం లేదని చెప్పాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు ఎలాగైనా తన కొడుక్కి పెళ్ళి చేయాలని ప్రయత్నం చేస్తారు చివరికి అతడికి పెళ్ళి జరిగిందా లేదా అనేది తెరపై చూడాల్సిందే
. ఈ చిత్రం పనోరమ స్టూడియో బ్యానర్  పై కుమార్ పాఠక్ నిర్మంచగా అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు గౌరవ్ - రోషన్ సంగీతం అందించగా నవంబర్ 8న చిత్రం విడుదల కానుంది.

రాజు గారి గది 3 చిత్ర ట్రైలర్ విడుదల

ఓంకార్ ...... మనకు ఈ పేరు వినగానే యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే. కానీ ఆయనకు మరో కోణం కూడా ఉంది,అదే దర్శకత్వo.ముందుగా జీనియస్ అనే ఓ సినిమాను నిర్మిస్తూ    దర్శకత్వం కూడా వహించారు.ఆ చిత్ర విజయం తర్వాత ఓంకార్ తన బడ్జెట్  లో సినిమా తీయాలని నిర్ణయించారు.

తను  అనుకున్న బడ్జెట్ లో కావాలంటే ప్రేమ కధా చిత్రం తీయగలడు .కానీ అందరిలా కాకుండా హారర్ - కామెడీ జోనర్ ని ఎంచుకొని ఎవరినో హీరోగా కాకుండా తన సొంత తమ్మడి నే హీరోగా తొలి పరిచయం చేశాడు.రాజు గారి గది సినిమాలో ముఖ్యంగా ధనరాజ్, షకలక శంకర్, సప్తగిరి కామెడీతో     ఇరగదీశారు. అశ్విన్, రాజీవ్ కనకాల, ధన్య బాలక్రిష్ణ , విద్యుల్లేఖ, పూర్ణ అలరించారు.ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

ఈ చిత్రం తర్వాత ఓంకార్ రాజు గారి గది 2 చిత్రంతో వచ్చారు.కానీ ఈ చిత్రం అలరించలేకపోయింది. ఈ చిత్రంలో నాగార్జున, సమంత లాంటి తారలు నటించారు అయినా కూడా కథలో సరైన విషయం లేదు.కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా   ఓంకార్ గారు త్వరలో మన ముందుకు రాజుగారి గది 3తో రాబోతున్నరు.ఇందులో అశ్విన్ ,అవి కాగోర్, ఆలీ, ధన్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం OAK ఎంటర్టైన్మెంట్  పై ఓంకార్ గారు నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు .ఈ చిత్రం  అక్టోబర్ 18న విడుదల కానుంది.




12, అక్టోబర్ 2019, శనివారం

బిగిల్ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

చాలా రోజుల నుండి తమిళనాడు ప్రేక్షకులే కాదు దళపతి విజయ్ గారిని ఇష్టపడే అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న బిగిల్  చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ద ర్శకుడు అట్లీ గారు తీసిన నాలుగు చిత్రాల్లో అనగా రాజారాణి ఎన్నటికీ మరువలేని ప్రేమ కథా చిత్రం. ఆ తర్వత తెరి సినిమా తెలుగులో పోలీసోడు గా రిలీజ్ అయి విజయం సాధించింది.

ఆ తర్వాత మెర్సల్  చిత్రం తెలుగులో అదిరింది అనే పేరుతో అనువాదమై నిజంగానే అదిరింది. ఇప్పుడు ముచ్చటగ మూడోసారి అట్లీ-విజయ్ కాంబినేషన్లో బిగిల్ అనే చిత్రం విడుదల కానుంది.ఈ చిత్ర ట్రైలర్ లో అట్లీ మార్క్ కనిపిస్తోంది.పోలీసోడు చిత్రంలో సమంత, అమీ జాక్సన్        నటించగా తన కూతురిని రక్షించే అండర్ కవర్ పోలీసు    కథ.GVప్రకాష్ సంగీతాన్ని అందించారు.

అదిరింది కథలో విజయ్ ముచ్చటగా మూడు పాత్రల్లో అభినయించారు.ఈ చిత్రంలో గ్రామంలో వైద్య సమస్య పరిష్కారం గురించి వివరించారు.AR. రెహమాన్ సంగీతాన్ని అందించారు.ప్రస్తుతం బిగిల్ చిత్రంలో మూడు పాత్రల్లో దళపతి విజయ్ నటిస్తున్నారు. తలైవి నయనతార ఇందులో కధానాయిక.AR రెహమాన్ సంగీతాన్ని అందించారు.


బిగిల్ చిత్రం ముఖ్యంగా పుట్ బాల్ ఆడే   అమ్మాయిల కథ.ఇందులో వారి కోచ్ గా ఒకప్పటి పుట్ బాల్ ఆటగాడిగా బిగిల్ పాత్రలో విజయ్, రౌడీ  రాయప్ప గా మరో పాత్రలో విజయ్, మైఖేల్ గా  నయనతారతో ప్రేమలో ఉండే మరో విజయ్  ఇలా మూడు పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నా రు దళపతి విజయ్. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో అనువాదం కానుంది.

ఈ చిత్రంలో విజయ్, నయనతారతో పాటు జాకీ ష్రాఫ్, యోగి బాబు, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించారు.AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కళపతి Sఅఘోరం, గణేష్, సురేష్ నిర్మించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో మధురమైన పటాసు పేల్చబోతోంది.

కైతి సినిమా ట్రైలర్ విశేషాలు

మన తెలుగు సినీ పరిశ్రమలో సూర్య అందరికీ తెలిసిన నటుడు.ఇంత కాలం సూర్య తమ్మడు కార్తీ అని అనేవారు.
కానీ కార్తి ఎంచుకుంటున్న  కథలను చూస్తే రానున్న రోజులలో కార్తీ అన్న సూర్య అని అనిపించేలా ఉంది. ప్రస్తుతం కైతి అనే సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.


కార్తి నటించిన చిత్రాల్లో యుగానికి ఒక్కడు, ఆవారా ,ఊపిరి, ఖాకీ చెప్పుకోదగినవి. ఈ మధ్య వచ్చిన చెలియా, దేవ్, చినబాబు పరాజయం పాలైయ్యాయి.అందుకే ఈ సారి కైతి సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని కార్తి ప్రయత్నం చేస్తున్నాడు. 10 సంవత్సరాలుగా తన భార్య పిల్లలను వదిలి ఖైదీగా మారిన హీరో జైలు నుండి పారిపోగా, తప్పుడు బిజినెస్  చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు ఛేదిస్తుండగా ఆ ముఠా నుండి పోలీసులను ఈ ఖైదీ ఎలా రక్షించాడో అనేది ఈ కథ.


ఈ చిత్రం క్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై S. R. ప్రకాష్ - ప్రభు నిర్మించారు. లోకేష్  కనకరాజ్ చిత్ర దర్శకుడు. సామ్ సంగీతాన్ని  అందించాడు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 27న అందరి ముందుకి రానుంది.మంచి యాక్షన్ థ్రిల్లర్ ని మిస్ అవ్వని వారు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే.

11, అక్టోబర్ 2019, శుక్రవారం

మోతీ చూర్ చక్నాచూర్ చిత్ర ట్రైలర్ విడుదల

మోతీచూర్ చక్నాచూర్ చిత్ర ట్రైలర్  ఇటీవల విడుదలైంది. ఈ మధ్య కాలంలో హాలీవుడ్, బాలీవుడ్ ..... అన్ని వుడ్ లలో  సినిమా కథలో దమ్ముంటే ఆ సినిమాలో పెద్ద హీరోలు ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం ముందు కథ బాగుండాలి. అతి తక్కవ బడ్జెట్  లో మంచి నటీ నటులతో అతి త్వరలో మన ముందుకు మోతీచూర్ చక్నాచూర్  చిత్రం రాబోతుంది.

పెళ్ళి కాని ప్రసాద్ అనగానే మనకు వెంటనే మల్లీశ్వరి చిత్రంలో వెంకీ గుర్తొస్తాడు.అలాగే ఈ చిత్రంలో ఓ 36 యేళ్ళ పెళ్ళి కాని యువకుడు ఎలా గైనా పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు.

అమ్మాయి అయితే చాలు ఆ అమ్మాయి ఎలా ఉన్న పర్లేదు అని అనుకునే అబ్బాయి. ఇక పోతే అమ్మాయి పెళ్లికొడుకు ఎలా ఉన్న పర్లేదు కాని ఫారిన్ కంట్రీలో ఉద్యోగం చేస్తూ ఉండాలి అని కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరు ఎలా కలిసారు, వీరికి ఎలా పెళ్ళి జరిగింది అనేది చిత్ర కధాంశం.

మోతీచార్ చక్నాచూర్ చిత్రం లో  ఎలాంటి పాత్రలో నైనా పరకాయ ప్రవేశం చేయగల అతి తక్కత నటులలో ఒకడైన నవాజుద్ధిన్ సిద్ధఖీ యువకుడి పాత్ర పోషించగా యువతి పాత్రలో సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టి నటిస్తోంది. ఈ చిత్రం వయాకామ్ 18మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజేష్ - కిరణ్ భాటియా నిర్మించగా దేబా మిత్ర బిస్వాల్  దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 15 న విడుదల కానుంది.

మమాంగం చిత్రం టీజర్ విడుదల

మమాంగం చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైంది. మలయాళంలో ప్రేక్షకులు అందరూ ముద్దుగా మమ్ముక్క అని పిలుచుకునే పద్మశ్రీ మమ్ముట్టి కథానాయకుడు‌.ఒకప్పడు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా, మలయాళ సినిమా అని పిలిచేవారు కాని జక్కన్న రాజమౌళి గారి పుణ్యమా అని బాహుబలి తరవాత నుండి భారతదేశ సినిమా అని పిలుస్తున్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రంతో చిరంజీవి గారు ఇటీవలే రికార్డుల మోత మోగిస్తూన్నారు..మలయాళ చిత్ర పరిశ్రమలో మమ్ముట్టి లాంటి వారు ఇలాంటి హిస్టారి కల్ కధాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోష కరమైన విషయం.ఈ చిత్రాన్ని  కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు , తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడం హర్షించదగ్గ విషయం. చరిత్ర కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అందరికి చేరువకావాలని గొప్ప ప్రయత్నం చేస్తున్నారు.


ఈ చిత్ర కధాంశం ఏమనగా 18 వ శతాబ్ద కాలంలో మమాంగం అనే ఉత్సవంలో 12 యేళ్ళ బాలుడు తన అతి ప్రాచీన భారతీయ కళరి విద్యతో శత్రువులను ఎలా ఎదురించాడో అనేది చాలా ఆసక్తికరంగా చూపించారు.ఈ చిత్రంలో మమ్ముట్టి  గారు తన అభినయంతో అలరించబోతున్నారు . వయసుతో సంబంధం లేకుండా తన కొడుకు  దుల్కర్ సల్మాన్ కి కూడా పోటీ ఇవ్వబోతున్నడు.


ఈ చిత్రం కావ్య ఫిలిం కంపెనీ ప్రొడక్షన్ పై వేణుకున్న పిళ్ళై  నిర్మించగ M. పద్మ  కుమార్ దర్వకత్వం వహించారు. M. జయచంద్రన్ సంగీతాన్ని అందించారు. నవంబర్ 21 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  విడుదల కానుంది.ఈ చిత్రంలో మమ్ముక్క తో పాటు ఉన్న ముకుందన, ప్రాచీ టెహలాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రం ఓ యుద్ధ వీరుడి కథ.


10, అక్టోబర్ 2019, గురువారం

తమిళ బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్

నిజ జీవితంలో మనందరికీ ఎదురయ్యే సమస్యలను టీవీ లో చూస్తూ ఉంటాము. కానీ అందులో కొంత కల్పితాలు ఉంటాయి. అలా కాకుండా రియాలిటీ షోలు బాగా ప్రాచుర్యం పొందాయి. రియాలిటీ షోలు అన్నింటిలో బిగ్ బాస్ ముందు వరుస లో ఉంది.ఈ బిగ్ బాస్ కి మూలాధారం అమెరికన్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ నుండి తీసుకోబడింది.

బిగ్ బాస్ మన దేశంలో ముందు హిందీ లో మొదలు పెట్టారు. హిందీ లో  సల్మాన్ ఖాన్ హోస్ట్, తర్వాత దక్షిణాదిలో కన్నడ భాషలో సుదీప్ హోస్ట్ గా ఉన్నారు. తెలుగు లో ఒక్కో సీజన్లో యన్.టీ.ఆర్, నాని,నాగార్జున హోస్టింగ్ చేశారు. మలయాళం లో మోహన్ లాల్, మరాఠీ లో మహేష్ మంజ్రేకర్ హోస్టింగ్ చేశారు.

తమిళంలో లోక నాయకుడు హోస్టింగ్ చేశారు. విజయవంతం గా మూడవ సీజన్ కూడా ముగిసింది. మొదటి సీజన్లో ఆరవ్ విజేతగా నిలిచాడు,రెండో సీజన్లో రిత్విక విజయం సాధించింది.మూడవ సీజన్లో ముగేన్ రావ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచారు.

ముగేన్ రావ్ అనే పేరు విన్న తరువాత మన తెలుగు వాడేనేమో అని సందేహం అక్కర్లేదు. ఈ ముగేన్ రావ్ తెలుగు మూలాలు ఉన్న మలేషియా దేశ పౌరుడు.తన చిన్న తనంలోనే తల్లితండ్రుల మధ్య గొడవలు జరిగి విడిపోయారు. ఆ సమయంలో ఒత్తిడికి గురై ముగేన్ రావ్ మలేషియన్ గ్యాంగ్ లో కొంత కాలం పని చేశాడు.ఇతను ముక్కోపి.

ఆ తర్వాత తన నైపుణ్యం తెలుసుకున్న ముగేన్ రావ్ గాయకుడిగా తమిళ సినీ పరిశ్రమలో ఆల్బమ్ చేయడం మొదలు పెట్టాడు. అలా బిగ్ బాస్ 3 లో అవకాశం వచ్చింది. మొదటి రోజు నుండి చివరి వరకు చాలా పరిపక్వత కలిగి ఆటను అర్థం చేసుకొని ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. ఆట మధ్యలో అభిరామి అనే కంటెస్టెంట్ తో ప్రేమాయణం సాగించి ఆటలో కొంత వెనుకబడి,తిరిగి తనదైన శైలిలో తోటి సభ్యులందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు.


బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...