4, అక్టోబర్ 2019, శుక్రవారం

దబాంగ్ 3 చిత్ర ప్రమోషన్

కండలవీరుడు చుల్ బుల్ పాండే సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో మారుమోగిపోతాయి.ఆయన చిత్ర పరిశ్రమలో మొదటి హిట్ మైనే ప్యార్ కియా తో మొదలైంది. ఆ సినిమా అప్పుడే సూపర్ డూపర్ హిట్, సినిమా పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాలను ఆకట్టుకుంటాయి.

సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు ఈ మధ్యలో కొంత పరాజయాన్ని చూసాయి.రేస్ 3,భారత్ చిత్రాలు కొంత నిరాశను మిగిల్చాయి. అందుకే విజయాలు సాధించిన ఫ్రాంచైజ్ దబాంగ్ చిత్రం మూడవ భాగం అతి త్వరలో డిసెంబర్ 20 న మన ముందుకు రానుంది.

దబాంగ్ మొదటి భాగం హిందీ పరిశ్రమలో బంపర్ హిట్ సాధించింది. ఆ చిత్రాన్నే తెలుగు లో మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.దబాంగ్ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ కొత్త రకం హావభావాలతో మంచి కామెడీ టైమింగ్ తో ఆద్యంతం యాక్షన్ తో అలరించారు.

దబాంగ్ చిత్రానికి  ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.దబాంగ్ 3 వ ఫ్రాంచైజ్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ మరియు అర్బాజ్ నిర్మిస్తున్నారు. ప్రభుదేవా గారు దర్శకుడు. సల్మాన్ ఖాన్ పరాజయాల  సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్ అని రీమేక్ చేసి ఘన విజయాన్ని ప్రభుదేవా అందించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి దబాంగ్ 3 చిత్రానికి పనిచేస్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్ర కథానాయిక.సాజిద్-వాజిద్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రం లో సల్మాన్ తండ్రిగా నటించిన వినోద్ ఖన్నా గారు మరణాంతరం వారి సోదరుడు ప్రమోద్ ఖన్నా గారు నటించారు.

దక్షిణాది చిత్రాలు చేస్తున్న అభినయ చక్రవర్తి బిరుదాంకితుడు కిచ్చ సుదీప్ ఈ చిత్రం లో ప్రతి నాయకుడిగా నటించారు.ఈ మధ్యే తను నటించిన పహిల్వాన్‌,సైరా చిత్రాలు విజయం సాధించాయి.ఇలాంటి స్టార్డమ్ లో కూడా విలన్ గా నటించడం కేవలం సుదీప్ గారికే సాధ్యం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఉజ్ డా చమన్ చిత్ర ట్రైలర్ విడుదల

ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కోంటున్న సమస్య బట్టతల .తలపై వెంట్రుకలు ఉంటే ఎలాగైనా స్టైల్ చేసుకోవచ్చు. కాని అసలే వెంట్రుకలు లేకుంటే ఎలా.....