1, అక్టోబర్ 2019, మంగళవారం

బైపాస్ రోడ్ చిత్ర ట్రైలర్ విడుదలైంది

మనం ఎక్కడైనా ప్రయాణిస్తున్న దారిలో గమ్యం చేరడానికి ఒక షార్ట్ కట్ రూటు కనిపిస్తే ఆ దారిలో వెళ్తాం దానినే బైపాస్ రోడ్ అని అంటాం.ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకోకండి దీనికి కారణం బైపాస్ రోడ్ అనే హిందీ చిత్రం ట్రైలర్  విడుదలైంది.

ఈ చిత్రం ముఖ్య విశేషాలు ఏమిటంటే చాలా రోజులుగా హిందీ పరిశ్రమలో అనుకున్నంత మంచి కథలు రావట్లేదు. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఉన్న మంచి కథలు హిందీ చిత్రాలను దాటేసింది. ఈ విషయంపై హిందీ పరిశ్రమ కు విమర్శలు వచ్చిపడుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర ట్రైలర్ చూసి చాలా ఆనందంగా ఉంది.

ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్. అసలు బైపాస్ రోడ్ లో ఏం జరిగింది, ఎవరు ఎవరిని చంపేశారు ఎందుకు చంపారు  అనేది ఈ చిత్ర ట్రైలర్ లో చూపిన విధానం సినీ ప్రేమికులకు తెగ నచ్చుతుంది. ఈ సినిమా లో నైపుణ్యం ఉన్నా సరైన గుర్తింపు రాని అతి తక్కువ నటులలో ఒకడైన నీల్ నితిన్ ముఖేష్  తన అద్భుతమైన నటనతో రక్తి కట్టించారు.

 ఈ చిత్రంలో  నీల్ నితిన్ ముఖేష్,అదాశర్మ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్ర కథ మరియు నిర్మాతగా కూడా నీల్వనితిన్ ముఖేష్ వ్యవహరించారు.షరిబ్ తోషి సంగీతాన్ని అందించారు. నమన్ నితిన్ ముఖేష్ చిత్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నవంబర్1 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...