10, అక్టోబర్ 2019, గురువారం

బాలా చిత్ర ట్రైలర్ విడుదల

హిందీ చిత్ర పరిశ్రమలో "బాలా"చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది.సినిమా బడ్జెట్ లో చిన్న, పెద్ద అనే తేడాలు ఉంటాయేమో కానీ నటనలో తేడా ఉండదు. అలా మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న యువ హీరో ఆయుష్మాన్ ఖురానా.





ఆయుష్మాన్ ఖురానా మంచి కథలను ఎంచుకోవడంలో దిట్ట. అలాగే మంచి కథ సిధ్ధంగా ఉంటే చాలు ఆయుష్మాన్ ఖురానాతో చేయడానికి ఎంతో మంది డైరెక్టర్, ప్రొడ్యూసర్లు లైన్ లో క్యూ కడుతున్నారు. ఈ యువ హీరో ఈమధ్య కాలంలో నటించిన అంధాధున్,ఆర్టికల్15,బధాయి హో,డ్రీమ్ గర్ల్ చెప్పుకోతగినవి.



ఆయుష్మాన్ ఖురానా సినిమాలో హీరో కాకముందు హోస్టింగ్ చేసేవారు.యమ్ టీవీ చానల్ నిర్వహించే రోడీస్ ప్రోగ్రామ్ లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో విక్కీ డోనర్ చిత్రం తో ఆరంగేట్రం చేసి విజయం సాధించాడు.దమ్ లగాకే హైషా,శుభ్ మంగళ్ సావధాన్,అంధాధున్ చిత్రాలు  మంచి పేరు తెచ్చాయి.

ఇప్పుడు బాలా అనే చిత్రం తో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రం యువత లో వస్తున్న బట్టతల అనే సమస్య పై స్పందించారు. ఓ 30 యేళ్ళ యువకుడికి బట్టతల సమస్య వలన పెళ్లి చేసుకోకుండా ఒత్తిడి, ఆందోళనతో ఎలా సతమతమవుతున్న సమయంలో ఎలా పరిష్కారం దొరికింది.ఈ చిత్రం లో ఆయుష్మాన్ కి జోడీగా భూమి పడ్నేకర్, యామి నటించారు. ఈ చిత్రం మ్యాడ్ కాక్ బ్యానర్ పై దినేష్ విజన్ ప్రొడక్షన్ లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నవంబర్7 న విడుదల కానుంది.సచిన్-జిగర్ సంగీతాన్ని అందించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...