29, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఆవిరి చిత్రం ట్రైలర్ అదిరింది

సినిమాల్లో రకరకాల జానర్లు ఉంటాయి. అంటే కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, లవ్ స్టొరీ, డ్రామా, ఫాంటసీ, బయోపిక్, హిస్టారికల్, హారర్. వీటన్నింటిలో తీసే సినిమాలు జయాపజయాలూ సాధారణం,కానీ హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మనకు తెలుసు హారర్ సినిమాలంటే భయమని అయినా కూడా ఆ సినిమాలు చూడటమంటే మహా సరదా. ఎందుకంటే ఈ సినిమా లో దెయ్యం ఏ విధంగా భయ పెట్టిందో తెలుసుకోవాలని అందరికీ ఉబలాటం.
ఈ సినిమా టైటిల్ లోనే అసలు కథ దాగి ఉంది.ఓ ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తున్నారు. కానీ ఆ.ఇంట్లో ఏదో అతీత శక్తి దాగి ఉంది.అది ఎవ్వరికీ కనిపించనంత వాళ్ళలో కలిసిపోయింది. మరి అది ఎక్కడ జీవిస్తోందంటే ఆ ఇంట్లో ఉండే ఆవిరి ప్రదేశాల్లో అనగా వంటింటి కుక్కర్ ఆవిరి,ఆవిరిగా ఉన్న అద్దాల మీద.



వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇదే ఆవిరి చిత్ర ట్రైలర్. ఇంతకాలం ఎక్కడో పాడుబడ్డ ఇంట్లో కొందరు మనుషులు వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న దెయ్యాలు చంపిన సినిమాలు ఎన్నో చూసేసాము.కానీ కొత్తగా కట్టిన స్మార్ట్ ఇళ్ళలో స్మార్ట్ గా ఆలోచించే దెయ్యాలు కేవలం రవిబాబు గారి సినిమాల్లో మాత్రమే చూడగలరు.కొత్తదనం ఎక్కడ ఉంటే అక్కడ రవిబాబు గారు కచ్చితంగా ఉంటారు. తాను తీసే ప్రతి సినిమాలో వైవిధ్యంగా ఉండాలని కోరుకునే అతి తక్కువ దర్శకులలో రవిబాబు గారు ముందు వరుసలో ఉంటారు.
ఆయన లవ్, కామెడీ జానర్లు తీశారు.హారర్ థ్రిల్లర్ లో అవును, అవును2 మంచి కలెక్షన్స్ రాబట్టారు. అందులో భాగంగానే మరో హారర్ థ్రిల్లర్ ఆవిరి రాబోతోంది.

ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు నిర్మించారు.రవిబాబు గారు దర్శకుడు. రవిబాబు, నేహా చౌహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

చాణక్య చిత్ర ట్రైలర్ విడుదల

చాణక్యుడు అనగానే మనకు ఆయన గొప్ప మేధావి అని నీతి శాస్త్ర పండితుడని తెలిసిందే. ఎలాంటి పరిస్థితి లోనైనా ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఈ విషయాలన్నీ ఎందుకు వివరించాలంటే ఈ చిత్రం పేరు కూడా చాణక్య.మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న అతి కొద్ది నటులలో గోపిచంద్ ఒకరు.

గోపిచంద్ రా ఏజెంట్ గా నటించిన మొదటి సినిమా చాణక్య. ఈ సినిమా లో ఆయనకు జోడీగా మెహ్రీన్ నటించింది.ఈ చిత్ర ట్రైలర్ లో మొదట గోపీచంద్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించాడు.,మెహ్రీన్  గోపిచంద్ ప్రేమలో పడటం. అంతలోనే గోపీచంద్ అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా రా ఏజెంట్ అని కరాచీ లో ఉన్న ఉగ్రవాద సంస్థ కు తెలియడం. కరాచీ లో గోపీచంద్ ఆ ఉగ్రవాద సంస్థను ఎలా అంతం చేశాడనేది వెండితెరపై చూడాల్సిందే.

ఈ చిత్రం లో గోపీచంద్‌,మెహ్రీన్,జరీన్ ఖాన్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా ఏ.కే.ఎంటర్టైనర్ పతాకంపై రామ బ్రహ్మం సుంకర నిర్మించారు.కథ-కథనం-దర్శకత్వం: తిరు.విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 5 న విడుదలకు  సిధ్ధంగా ఉంది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న గోపీచంద్ కెరీర్ లో మంచి హిట్ తగిలి చాలా కాలం అయ్యింది. ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తీసుకురావాలని, మరిన్నీ మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం.

28, సెప్టెంబర్ 2019, శనివారం

హౌస్ ఫుల్ 4 చిత్రం ట్రైలర్

మనం ఎప్పుడైనా ఇంట్లో బోర్ కొడితే ఉల్లాసంగా సినిమా థియేటర్లకి వెళ్లినప్పుడు థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డు కనబడితే ఆ సినిమా హిట్ అని అనిపిస్తుంది. అదేవిధంగా సినిమా పేరే హౌస్ ఫుల్ అయితే అందులోనూ ఆ సినిమా హౌస్ ఫుల్ గా నడిచే ఫ్రాంచైజీ.

హాలీవుడ్ లో చాలా  హిట్ సినిమాలు ఫ్రాంచైజ్ రూపంలో సిరీస్ వస్తాయి కానీ మొదటిసారి భారత చిత్ర పరిశ్రమలో హిట్ సిరీస్ లో 4 వ చిత్రం రావడం ఇదే. హౌస్ ఫుల్ 1 లో అక్షయ్ కుమార్, దీపికా పదుకునే, రితేష్, లారా దత్తా,చంకీపాండే ముఖ్య పాత్రల్లో 2010 లో విడుదలైన హిట్ చిత్రం. హౌస్ ఫుల్ 2 లో అక్షయ్, జాన్ అబ్రహం, అసిన్, జాక్వెలిన్,రితేష్, చంకీపాండే ముఖ్య పాత్రల్లో 2012 లో హిట్ కైవసం చేసుకుంది.2016 లో రిలీజ్ అయిన హౌస్ ఫుల్ 3 లో అక్షయ్, జాక్వెలిన్, అభిషేక్, నర్గీస్, రితేష్  ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూడు సినిమాలు కామెడీకి
సంబంధించినవి,ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే భారీ తారాగణం నటించిన సినిమాలు.మూడు సినిమాల్లో అక్షయ్, రితేష్, చంకీపాండే అలరించారు. ఈ మూడు చిత్రాలను సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్ హౌస్.

హౌస్ ఫుల్4 చిత్రాన్ని కూడా సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆయన పై మీ టూ బాధితురాలు కేసు పెట్టారు. అందుకే ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు.ఈ సిరీస్ ఫర్హాద్ దర్శకత్వంలో అక్షయ్, బాబీ డియోల్,రితేష్, చంకీపాండే,పూజ హెగ్డే, క్రితీ సనన్‌,క్రితీ కర్బంద,జానీ లివర్, నవాజుద్దీన్,రానా ముఖ్య నటించగా ఫాక్స్ స్టార్ స్టూడియో ఆధ్వర్యంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మాత.
ట్రైలర్: ఇందులో 1419 లో ఓ దేశ రాజు తన ముగ్గురు అమ్మాయిల పెళ్లి కోసం స్వయంవరం ఏర్పాటు చేయగా ముగ్గురు రాజకుమారులు వారిని వివాహం చేసుకోవడం.ఈ కథ తిరిగి 2019 లో మొదలై గందరగోళం ఏర్పడింది.ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 25 న విడుదల కానుంది. ఇది పూర్తి వినోదాత్మకంగా ఉండే చిత్రం.

26, సెప్టెంబర్ 2019, గురువారం

సాండ్ కీ ఆంఖ్ చిత్ర ట్రైలర్ విడుదల

సాండ్ కీ ఆంఖ్ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర టైటిల్ ని మన తెలుగు లో తర్జుమా చేస్తే ఎద్దు కన్ను అనే అర్ధం వస్తుంది. భలే తమాషా గా ఉంది కదా.కానీ ఈ చిత్ర ట్రైలర్ మాత్రం చూస్తున్నా కొద్ది చూడాలనిపించేలా ఉంది. ఈ చిత్రం లో తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్,ప్రకాష్ ఝా ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైనర్ వారు నిర్మాణం చేయగా అనురాగ్ కష్యప్ నిర్మాతగా వ్యవహరించారు.  తుషార్ హిరనందని ఈ సినిమా దర్శకుడు. విశాల్ మిష్రా సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 న విడుదల చేయనున్నారు.
ట్రైలర్ గురించి :అనాదిగా భారతీయ సంస్కృతిలో ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు గా ఇంట్లో పనిమనుషులుగా  ఉండే ఓ మధ్య తరగతి కుటుంబం. అందులో ఇద్దరు బామ్మలు ,వారికి ఇద్దరు మనవరాళ్ళు.ఆ మనవరాళ్ళకు మంచి ఉద్యోగం కోసం ఈ బామ్మలిద్దరు తుపాకీతో గురి చూసి షూటింగ్ క్రీడా లో పాల్గొని,ఎన్నో అవమానాలు భరించి చివరకు ఆ మనవరాళ్ళకు ఉద్యోగం కల్పించటం.


ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తీశారు. ఇది  అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన చక్కటి బయోపిక్.ఇందులో తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్ అద్భుతమైన హావభావాలతో అలరించారు. చివరగా ఆడవాళ్లు వంటింట్లో చపాతీలే కాదు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అని నిరూపించింది ఈ సినిమా.

25, సెప్టెంబర్ 2019, బుధవారం

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత

ఇంక్విలాబ్ శ్రీవాస్తవ ఈ పేరు వినడానికి కొత్త గా ఉంది .కానీ అమితాబ్ బచ్చన్ అనే పేరు వినని వారు దేశ నలుమూలల లేరనేది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. బచ్చన్ గారు అక్టోబరు11 1942 న జన్మించారు.తండ్రి హరివంష్ రాయ్ ప్రముఖ రచయిత,తల్లి తేజి సామాజిక వేత్త. హరివంష్ రాయ్ గారి కలం పేరు బచ్చన్ అందుకే అమితాబ్ బచ్చన్ గా పేరు స్థిరపడింది.





బచ్చన్ గారు సినిమా లో రాకముందు రేడియో లో వ్యాఖ్యాతగా ప్రయత్నం చేశారు కానీ ఆయన గంభీర గొంతు బాలేదన్నారు.తర్వాత సినిమా ల్లో ప్రయత్నం చేశారు అప్పుడు కూడా చాలా మంది అద్దంలో ముఖం చూసుకోమని ఎగతాళి చేశారు. కానీ బచ్చన్ గారు ఏమాత్రం అధైర్యపడకుండా ప్రయత్నం కొనసాగించి ఎవరైతే గొంతు బాలేదు, అందంగా లేవన్నారో వారితోనే శెబాష్ అని అనిపించాడు.
బచ్చన్ గారు ముందు నటించిన సినిమాలన్నీ సరిగా ఆడలేదు, మరికొన్ని ఫ్లాప్ అయ్యయి.తన కెరీర్ లో ఆనంద్,దీవార్,షోలే,జంజీర్, డాన్,కూలీ‌,అగ్నీపథ్,పీకూ చిత్రాలు చెప్పుకోతగినవి.షోలే సినిమా అయితే అమితాబ్ కెరీర్ లోనే కాదు భారత దేశ చరిత్ర లోనే ఓ మైలురాయి.
కూలీ చిత్రం షూటింగ్ లో ఓ ఫైట్ చిత్రీకరిస్తుంండగా తన ప్రక్కటముకల్లో తగిలిన గాయం ఇప్పటికీ వేధిస్తోంది.
బచ్చన్ గారిని అభిమానులు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని, అమిత్ జీ అనీ,బాలీవుడ్ సెహన్షా అని పిలుస్తారు. బచ్చన్ గారు 160 సినిమాల్లో నటించారు. తెలుగు లో మనం సినిమా లో చిన్న పాత్రలో కనిపించారు.
మెగాస్టార్ చిరంజీవి గారితో సైరా సినిమా లో గురువు గా అలరించబోతున్నారు.
అమితాబ్ బచ్చన్ గారిని గౌరవ భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సత్కరించారు. ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారత దేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ గారికి ఇదే నా గౌరవ అభినందనలు.

23, సెప్టెంబర్ 2019, సోమవారం

స్కై ఈస్ పింక్ చిత్ర ట్రైలర్ విశేషాలు

స్కై ఈస్ పింక్ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.మామూలుగా.ఆకాశం నీలం రంగు ఉంటుంది కానీ ఇక్కడ ఈ సినిమా టైటిల్ లో ఆకాశం గులాబీ రంగు లో ఎందుకు ఉందో తెలియాలంటే చిత్రం విడుదలయ్యాక చూడాల్సిందే. ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీయబడింది.
స్కై ఈస్ పింక్ సినిమా లో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో నటించింది.ప్రియాంక చోప్రా పేరు హాలీవుడ్ లో కూడా మారుమోగింది. తను 3 సంవత్సరాల తర్వాత చేసిన హిందీ సినిమా ఇదే. ఇంగ్లీష్ గాయకుడు నికోలస్ జోన్ ని ప్రేమించి పెళ్ళాడిన తర్వాత అంగీకరించిన మొదటి హిందీ సినిమా స్కై ఈస్ పింక్.
ఈ చిత్ర విశేషాలలోకి వెళ్తే  ముఖ్య పాత్రల్లో ఫర్హాన్ అక్తర్,జైరా వసీమ్‌,రోహిత్ సురేష్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు శోనాలీ బోస్. RSVP బ్యానర్ పై రొన్ని స్కౄవాలా మరియు సిధ్ధార్త్ రాయ్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు.ప్రీతమ్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించాడు.
ఈ చిత్ర ట్రైలర్ లో ముందు ప్రియాంక చోప్రా మరియు ఫర్హాన్ అక్తర్ తమ యవ్వనం లోనే ప్రేమలో పడ్డారు. అది కాస్తా ప్రియాంక గర్భం దాల్చడం,వారికి అందమైన అమ్మాయి పుట్టడం. ఆ అమ్మాయి కి యుక్త వయస్సు లో తీవ్రంగా ఊపిరితిత్తుల సమస్య ఉందని గమనించిన ఆ దంపతులు ఎలా ఆ అమ్మాయి ని బ్రతికించుకుంటారో అనేదే ఈ సినిమా సారాంశం.ఈ.సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్11 న  విడుదల  కాబోతోంది.

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

"వార్" చిత్ర విశేషాలు

వార్ అనగా యుద్ధం,మరి వార్ చిత్రం లో ఎవరెవరి మధ్య యుద్ధం జరగబోతోంది అసలు కారణం అతి త్వరలో తెలియబోతోంది.చిత్ర విశేషాలను గమనిస్తే హిందీ చిత్ర పరిశ్రమ అయిన బాలీవుడ్ లో మునుపెన్నడూ లేని ఆసక్తికరమైన మల్టీస్టారర్ చిత్రం వార్.
2000 వ సంవత్సరం లో విడుదలైన కహోనా ప్యార్ హై చిత్రం తో హృతిక్ రోషన్ హీరో గా ఆరంగేట్రం చేశారు. ఇటీవలే ఈ చిత్రానికి గాను 20 సంవత్సరాల చరిత్రలో మంచి సినిమాగా ఐఫా అవార్డు దక్కింది.హృతిక్ రోషన్ తాను సినిమా నేపథ్య కుటుంబం నుండి వచ్చారు. తన నట జీవితంలో కహోనా ప్యార్ హై,లక్ష్య,కోయి మిల్గయా,ధూమ్2,క్రిష్, కాబిల్,సూపర్30 లాంటి ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు.హృతిక్ రోషన్
ముఖ్యంగా తన శరీరాకృతి, డాన్స్, ఫైట్స్, నటనకు ప్రసిద్ధి.
జాకీష్రాఫ్ నట వారసుడిగా టైగర్ ష్రాఫ్ 2014 లో పరుగు సినిమా రీమేక్ హీరోపంతి తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు.తర్వాత భాగీ,ఫ్లయింగ్ జాట్,మున్నా మైకేల్ ,స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్2 చిత్రాలతో అలరించారు. టైగర్ ష్రాఫ్ బ్రూస్లీ మరియుమైఖేల్ జాక్సన్ వీరాభిమాని. అందుకే వారిలాగే ఫైట్ మరియు డాన్స్ ఇరగదీస్తున్నాడు. కానీ టైగర్ కు సరైన హిట్ దొరకలేదు. అందుకే తాను గురువు గా అభిమానించే హృతిక్ తో సినిమా చేసి బంపర్ హిట్ అందుకోవాలని కోరుతున్నారు.
ఈ.చిత్రం లో వాణి కపూర్ కథానాయిక.
ఈ చిత్రాన్ని బ్యాంగ్ బ్యాంగ్ లాంటి యాక్షన్ సినిమా తెరకెక్కించిన  ప్రముఖ దర్శకుడు సిధ్ధార్త్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యశ్రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు.విశాల్-శేఖర్ ద్వయం సంగీతం అందించారు.
ఈ చిత్రం కోసం హృతిక్ మరియు టైగర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ట్రైలర్ లో హృతిక్ గూఢచారి గా తన ఇష్టారాజ్యంగా మిషన్ లో పాల్గొనగా అతన్ని ఆపవలసి తప్పక టైగర్ ఆ మిషన్లో తన గురువైన హృతిక్ ని ఎలా అడ్డుకుంటాడని చూపించారు. ఈ చిత్రం అతిభారీ యాక్షన్ థ్రిల్లర్.ఈ చిత్రం అక్టోబర్2 న విడుదల కాబోతోంది.

21, సెప్టెంబర్ 2019, శనివారం

గద్దల కొండ గణేష్ చిత్ర విశేషాలు

గద్దల కొండ గణేష్ చిత్రం టైటిల్ వాల్మీకి నుండి మార్చడం జరిగింది. చిత్ర నిడివి 2 గంటల 52 నిమిషాలు ఉంది.ఈ.చిత్రం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన నటనతో మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మక ప్రయత్నం చేశాడు.చిత్రానికి సంబంధించి వరుణ్ తేజ్ హింస తో కూడిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ప్రస్తుత గొప్ప దర్శకులలో ఒకరైన హరీష్ శంకర్ గారు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రం లో తమిళ యువ నటుడు అథర్వ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీదేవి పాత్రలో పూజ హెగ్డే చాలా చక్కగా ఒదిగిపోయింది.బుజ్జమ్మ పాత్రలో మ్రిణాలిని బాగా నటించింది.
మిగిలిన తారాగణం రచ్చ రవి, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి,కమెడియన్ సత్య ఆద్యంతం కడుపుబ్బా నవ్వించాడు. మిక్కీ జే మేయర్ ప్రాణం పెట్టి అందించిన   బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా లో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయిలో నిలబెట్టింది.దేవత సినిమా లోని ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేసిన విషయం తెల్సిందే. గద్దల కొండ గణేష్ సినిమా తమిళ చిత్రం "జిగర్తండా" నుండి మార్పులు చేర్పులు చేసి మన తెలుగు తనానికి తగినట్లు తీశారు.
ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వరుణ్ తేజ్ కళ్లతో పలికించిన హావభావాలు, తెలంగాణ ఉఛ్ఛారణ.ఈ చిత్రం వరుణ్ తేజ్ ని మరో మెట్టుకు తీసుకెళ్లే మైలురాయి.

18, సెప్టెంబర్ 2019, బుధవారం

సైరా చిత్ర ట్రైలర్


మన అందరివాడు,ఆపద్బాంధవుడు‌‌,అడవిలో వేటకు సిధ్ధమైన ఖైదీ, స్వయంకృషితో ఆరాధన చేసే మన గ్యాంగ్ లీడర్,ముఠామేస్త్రీ గా ప్రేక్షకుల హ్రృదయాలలో చెరగని ముద్ర వేసిన ఇంద్ర సేనాని,ఇండస్ట్రీలో విజేతగా నిలిచిన ఠాగూర్.


కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 151వ చిత్రం "సైరా నరసింహారెడ్డి"అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని చరిత్ర విస్మరించిన ఓ స్వాతంత్ర్య సమర ధీక్షలో మహాయోధుడైన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గారి జీవిత కథను సినిమాగా తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ గారి సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ముఖ్య దర్శకులలో ఒకరైన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.అమిత్-త్రివేది ద్వయం సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రం లో భారత దేశం గర్వించదగ్గ నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్ గారు నటించడం హర్షణీయం. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి,కిచ్చ సుదీప్, తలైవి నయనతార,మిల్కీ తమన్నా  తమ పాత్రల్లో జీవించినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది.ఈ చిత్రం అక్టోబర్2 న విడుదల కాబోతోంది.
ట్రైలర్ చూస్తే అభిమానులకు కావలసిన అన్ని హంగులు ఉన్న భారీ బడ్జెట్ హిస్టారికల్ బయోపిక్.


17, సెప్టెంబర్ 2019, మంగళవారం

మాఫియా:చాప్టర్1 చిత్ర టీజర్


అరుణ్ విజయ్ కథానాయకుడిగా,ప్రియ భవానీ కథానాయికగా,ప్రసన్న ముఖ్య పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మాఫియా:చాప్టర్1 చిత్ర టీజర్ విడుదలైంది.




  • ఈ చిత్ర ట్రైలర్లలో హీరో అరుణ్ విజయ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అలరించబోతున్నారు.హీరో పాత్రకు సమానంగా ప్రసన్న స్టైలిష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించారు
  • ఈ చిత్ర ట్రైలర్ లో అరుణ్ విజయ్ తాను అడివికి రాజైన సింహం లాంటి వాడినని,యుద్ధం వస్తే తన బలం చూపిస్తానని అన్నారు.అరుణ్ విజయ్ సాహా సినిమా లో స్టైలిష్ డాన్ గా అలరించాడు.







    • విలన్ తనని తాను జిత్తులమారి నక్కనని,సరైన సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలుసని అన్నారు.ఈ సినిమా లో విలన్ గా నటించిన ప్రసన్న హీరో కి నటనతో గట్టి పోటీ వుంటుందనే విషయం అర్థం అవుతోంది
    • ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ వారు అందించగా, అలీరజా సుభాస్కరన్ నిర్మాత.ఈ చిత్రాన్ని కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేశారు.జేక్స్ బిజోయ్ స్వరాలు అందించారు.ఈ చిత్రం టీజర్ లో కొన్ని ఫ్రేమ్ లో ఎరుపురంగు విధ్వంసానికి గుర్తుగా వాడటం ఆకర్షణీయం.

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...