25, సెప్టెంబర్ 2019, బుధవారం

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత

ఇంక్విలాబ్ శ్రీవాస్తవ ఈ పేరు వినడానికి కొత్త గా ఉంది .కానీ అమితాబ్ బచ్చన్ అనే పేరు వినని వారు దేశ నలుమూలల లేరనేది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. బచ్చన్ గారు అక్టోబరు11 1942 న జన్మించారు.తండ్రి హరివంష్ రాయ్ ప్రముఖ రచయిత,తల్లి తేజి సామాజిక వేత్త. హరివంష్ రాయ్ గారి కలం పేరు బచ్చన్ అందుకే అమితాబ్ బచ్చన్ గా పేరు స్థిరపడింది.





బచ్చన్ గారు సినిమా లో రాకముందు రేడియో లో వ్యాఖ్యాతగా ప్రయత్నం చేశారు కానీ ఆయన గంభీర గొంతు బాలేదన్నారు.తర్వాత సినిమా ల్లో ప్రయత్నం చేశారు అప్పుడు కూడా చాలా మంది అద్దంలో ముఖం చూసుకోమని ఎగతాళి చేశారు. కానీ బచ్చన్ గారు ఏమాత్రం అధైర్యపడకుండా ప్రయత్నం కొనసాగించి ఎవరైతే గొంతు బాలేదు, అందంగా లేవన్నారో వారితోనే శెబాష్ అని అనిపించాడు.
బచ్చన్ గారు ముందు నటించిన సినిమాలన్నీ సరిగా ఆడలేదు, మరికొన్ని ఫ్లాప్ అయ్యయి.తన కెరీర్ లో ఆనంద్,దీవార్,షోలే,జంజీర్, డాన్,కూలీ‌,అగ్నీపథ్,పీకూ చిత్రాలు చెప్పుకోతగినవి.షోలే సినిమా అయితే అమితాబ్ కెరీర్ లోనే కాదు భారత దేశ చరిత్ర లోనే ఓ మైలురాయి.
కూలీ చిత్రం షూటింగ్ లో ఓ ఫైట్ చిత్రీకరిస్తుంండగా తన ప్రక్కటముకల్లో తగిలిన గాయం ఇప్పటికీ వేధిస్తోంది.
బచ్చన్ గారిని అభిమానులు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని, అమిత్ జీ అనీ,బాలీవుడ్ సెహన్షా అని పిలుస్తారు. బచ్చన్ గారు 160 సినిమాల్లో నటించారు. తెలుగు లో మనం సినిమా లో చిన్న పాత్రలో కనిపించారు.
మెగాస్టార్ చిరంజీవి గారితో సైరా సినిమా లో గురువు గా అలరించబోతున్నారు.
అమితాబ్ బచ్చన్ గారిని గౌరవ భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సత్కరించారు. ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారత దేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ గారికి ఇదే నా గౌరవ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...