26, నవంబర్ 2019, మంగళవారం

అమ్మ తిరిగి మన ముందుకు రాబోతోంది...

నమస్కారం మిత్రమా!చరిత్ర మొదలయ్యే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ,అలాగే చరిత్ర సృష్టించాలంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.పది మందిలో ఒక్కడిలా బతకడం చాలా సులభం కానీ కోటిమందికి ఒకడిలా బతకాలంటే ఎంతో ఓర్పు, సహనం ,నడవడిక అవసరం.

చరిత్ర సృష్టించిన ప్రతి సృష్టి కారుడి జీవితంలో అనేక బాధలు కష్టాలు. వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు సాగారు కాబట్టి వారు చరిత్రను సృష్టించారు.ఇదంతా మీరు ఎందుకు అని అనుకుంటున్నారా 50 సంవత్సరాల క్రితం ఒక సాదాసీదా నటిగా మొదలైన తన ప్రయాణం కేవలం తమిళనాడు ప్రభుత్వమే కాదు మొత్తం దేశాన్ని ఊపేస్తుందని ఎవరూ ఊహించలేదు ఆమె ఎవరో కాదు తమిళ తంబీలు ముద్దుగా అమ్మ అని పిలుచుకునే జయలలిత గారు.

జయలలిత గారు సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి,  రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి జయహో అమ్మ అని  ప్రజల చేత నీరాజనాలు అందుకుంది.కానీ చివరగా ఆమె మరణం వెనుక ఎవరికీ తెలియని రహస్యం దాగి ఉంది. అందుకే ఆమె  జీవితాన్ని తలైవి అనే పేరుతో సినిమా ను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని విబ్రి మరియు కర్మ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విష్ణువర్ధన్ ఇందూరి మరియు శైలేష్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ గారు కథను అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎ.ఎల్ .విజయ్ దర్శకత్వం వహించగా జూన్ 26 2020 సంవత్సరం లో విడుదల కానుంది.ఈ చిత్రం మూడు భాషల్లో అనగా తెలుగు, తమిళం ,హిందీలోతెరకెక్కుతుంది.ఈ చిత్రంలో భారతదేశం గర్వించదగ్గ నటి కంగనా రనౌత్ నటించగా అరవిందస్వామి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.కంగనా రనౌత్ గారిపై ప్రోస్థటిక్ మేకప్ తో    జయలలిత గారి మొదటి పోస్టర్ ను రిలీజ్  చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...