10, అక్టోబర్ 2019, గురువారం

తమిళ బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్

నిజ జీవితంలో మనందరికీ ఎదురయ్యే సమస్యలను టీవీ లో చూస్తూ ఉంటాము. కానీ అందులో కొంత కల్పితాలు ఉంటాయి. అలా కాకుండా రియాలిటీ షోలు బాగా ప్రాచుర్యం పొందాయి. రియాలిటీ షోలు అన్నింటిలో బిగ్ బాస్ ముందు వరుస లో ఉంది.ఈ బిగ్ బాస్ కి మూలాధారం అమెరికన్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ నుండి తీసుకోబడింది.

బిగ్ బాస్ మన దేశంలో ముందు హిందీ లో మొదలు పెట్టారు. హిందీ లో  సల్మాన్ ఖాన్ హోస్ట్, తర్వాత దక్షిణాదిలో కన్నడ భాషలో సుదీప్ హోస్ట్ గా ఉన్నారు. తెలుగు లో ఒక్కో సీజన్లో యన్.టీ.ఆర్, నాని,నాగార్జున హోస్టింగ్ చేశారు. మలయాళం లో మోహన్ లాల్, మరాఠీ లో మహేష్ మంజ్రేకర్ హోస్టింగ్ చేశారు.

తమిళంలో లోక నాయకుడు హోస్టింగ్ చేశారు. విజయవంతం గా మూడవ సీజన్ కూడా ముగిసింది. మొదటి సీజన్లో ఆరవ్ విజేతగా నిలిచాడు,రెండో సీజన్లో రిత్విక విజయం సాధించింది.మూడవ సీజన్లో ముగేన్ రావ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచారు.

ముగేన్ రావ్ అనే పేరు విన్న తరువాత మన తెలుగు వాడేనేమో అని సందేహం అక్కర్లేదు. ఈ ముగేన్ రావ్ తెలుగు మూలాలు ఉన్న మలేషియా దేశ పౌరుడు.తన చిన్న తనంలోనే తల్లితండ్రుల మధ్య గొడవలు జరిగి విడిపోయారు. ఆ సమయంలో ఒత్తిడికి గురై ముగేన్ రావ్ మలేషియన్ గ్యాంగ్ లో కొంత కాలం పని చేశాడు.ఇతను ముక్కోపి.

ఆ తర్వాత తన నైపుణ్యం తెలుసుకున్న ముగేన్ రావ్ గాయకుడిగా తమిళ సినీ పరిశ్రమలో ఆల్బమ్ చేయడం మొదలు పెట్టాడు. అలా బిగ్ బాస్ 3 లో అవకాశం వచ్చింది. మొదటి రోజు నుండి చివరి వరకు చాలా పరిపక్వత కలిగి ఆటను అర్థం చేసుకొని ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. ఆట మధ్యలో అభిరామి అనే కంటెస్టెంట్ తో ప్రేమాయణం సాగించి ఆటలో కొంత వెనుకబడి,తిరిగి తనదైన శైలిలో తోటి సభ్యులందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...