29, అక్టోబర్ 2019, మంగళవారం

ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అని అంటున్న యువహీరో

       జీవితంలో కోరుకున్నవి జరగాలి అని అందరూ అనుకుంటారు కానీ జరిగేది జరగక మానదు, జరగాల్సింది మనకు చెప్పి జరగదు.పుట్టిన పసి పిల్లాడి నుంచి కాటికి వెళ్లే ముసలివాడి దాకా అందరికీ స్వతహాగా కోరికలు ఉంటాయి.పుట్టిన పిల్లవాడు తనకు కావాల్సింది ఏడ్చి దక్కించుకుంటాడు అలాగే ముసలి వయసులో ఉన్నవారు తమ కోరికలు చాదస్తం తో తీర్చుకుంటారు.


              కానీ యుక్తవయసులో ఉన్న ప్రతి ఒక్క యువతీ, యువకులు తాము కోరుకున్నవి ఎలా సాధించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఒకవైపు చేసే పని మనసుకు నచ్చక మరోవైపు మనసుకు నచ్చే పని చేయలేక ఇటు మనసుకు అటు సమాజానికి మధ్యలో యువత ప్రెషర్ కుక్కర్ లో పప్పు లాగా నలిగి పోతున్నారు.ఈ కథాంశం తో ఇటీవల తెరకెక్కిస్తున్న ప్రెషర్ కుక్కర్ చిత్ర టీజర్ విడుదల అయింది.

               
                              ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన చిత్రాలు రాలేదని అందరూ గుసగుసలాడుతున్నారు .కానీ కథలో దమ్ముంటే చిన్న చిత్రం పెద్ద చిత్రం అని తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు.ఈ చిత్రం టీజర్ లో కథానాయకుడికి చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలని బ్రెయిన్ వాష్ చేసి ఉంచాడు .తీరా అమెరికా వెళ్లే సమయంలో కథ ఎలా మలుపు తిరిగింది అనేది చూడాల్సి ఉంది.   
       

                                       ఈ చిత్రంలో సాయి రోనక్ , ప్రీతి అస్రాని,   రాహుల్ రామకృష్ణ ,తనికెళ్ల భరణి గారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి ప్రొడక్షన్స్ లో సుజుయ్ దర్శకత్వం వహించారు.పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు.సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. నవంబర్ 8న ఈచిత్రం విడుదల కాబోతోంది.
   
                            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...